20 June, 2026 | 3:30 AM

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2026 01:46 AM

సత్తుపల్లి జూన్ 19 (విజయక్రాంతి): లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్న నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

కూసుమంచిలో.. 

కూసుమంచి, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలిగి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా నాయకుడు జొన్నలగడ్డ రవికుమార్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టే గురవయ్య,లోక్యతండ సర్పం వడిత్య వెంకటేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, చాట్ల పరశురాం పాల్గొన్నారు.