సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
నిర్మల్ జూన్ 19 ( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందిపుచ్చుకొని కేసులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్లకు సాంకేతిక పరికరాలు అందించారు.ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు బా ర్కోడ్ స్కానర్లు, లేబుల్ ప్రింటర్లు, సింగిల్ డిజిట్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ప్రింటర్లను పంపిణీ చేశారు.ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరగడం, కంప్యూటర్లు, ట్యాబ్ల సాంకేతిక సమస్యల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడనున్నాయి.
పరికరాల ప్రాధాన్యత
వేలిముద్ర (ఫింగర్ ప్రింట్) స్కానర్లు: వ్యక్తుల గుర్తింపును ధృవీకరించడం, నేర చరిత్రను గుర్తించడం, అనుమానితుల వివరాలను తక్షణమే సేకరించడం మరియు పెండింగ్ కేసుల ఛేదనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
సింగిల్ డిజిట్ స్కానర్లు:పోర్టబుల్ బయోమెట్రిక్ పరికరాలైన ఇవి వ్యక్తుల గుర్తింపును క్షణాల్లో ధృవీకరించడంతో పాటు కేంద్రీకృ త డేటాబేస్లతో సరిపోల్చి నేర చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
బార్కోడ్ స్కానర్లు: ముద్రించిన బార్కోడ్లను డిజిటల్ సమాచారంగా మార్చి రికా ర్డుల నిర్వహణ, సాక్ష్యాల ట్రాకింగ్ మరియు ఇతర పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తాయి.
లేబుల్ ప్రింటర్లు: కేసు ఫైళ్లు, సాక్ష్యాధారాలుఇతర రికార్డులను ఖచ్చితం గా గుర్తించి నిర్వహించడంలో కీలకంగా ఉపయోగపడతాయి. తెలంగాణ పోలీస్ శాఖలో సాక్ష్యాల భద్రత, రికార్డుల నిర్వహణలో ఇవి ముఖ్యమైన సాధనాలుగా పని చేయనున్నాయి. జి ల్లా పోలీస్ శాఖను మరింత సాంకేతికంగా బలోపేతం చేసి, ప్రజలకు వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పరికరాలను అందజేసినట్లు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ తో పాటు ఏఓ యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి,సమ్మయ్య, ఆర్.ఐ (అడ్మిన్) రామ్ నిరంజన్ రావ్ ,ఎస్త్స్రలు జీ.లింబాద్రి , శ్రీకాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






