20 June, 2026 | 2:13 AM

ధర్మపురిలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2026 01:12 AM

‘హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి, జూన్19 (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మపురిలోని నంది చౌరస్తాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని మంత్రి అడ్లూరి అన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు.

దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టకుండా ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ను ప్రధాని మంత్రి చేశారని మంత్రి అడ్లూరి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ పని చేస్తున్నారని 2029లో రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా చూడాలని ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి కోరారు. ఈకార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ , తిరుపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.