షాద్‌నగర్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
షాద్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్‌లో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ రాహుల్ గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి విలువల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అంకితభావం ప్రశంసనీయమని అన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం రాహుల్ గాంధీ ధైర్యంగా నిలబడుతున్నారని కొనియాడారు. దేశం కోసం అసాధారణ త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వాన్ని వినయంతో, నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ , సీనియర్ నేత ఆగిర్యల కృష్ణ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.






