21 June, 2026 | 1:38 PM

యూరియా కలిపిన నీటిని తాగిన పది ఆవులు మృతి?

19-06-2026 12:33 PM

షాద్ నగర్ జూన్ 19 (విజయక్రాంతి): యూరియా కలిపిన నీటిని తాగిన పది ఆవులు మృతి చెందాయి.శుక్రవారం నాడు నందిగామ మండలం  కుమ్మరిగూడ గ్రామానికి చెందిన బండరి రఘునందన్ అనే వ్యక్తి కి చెందిన 10 ఆవులు మృతి చెందాయి. కాపరిగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి దానాలో యూరియా కలిపి పెట్టడంతో ఆవులు మృతి చెందినట్లు అనుమనిస్తున్నారు. కాగా పశువుల కాపరి సంఘటన జరిగిన వెంటనే పరారీ కావడంతో పోలీసులు సంఘటన స్థలాలు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.