11 August, 2026 | 1:52 AM

రాహుల్ గాంధీ ఛత్త్రోన్‌కీ గుంజ్

11-08-2026 12:00 AM

వరంగల్, ఆగష్టు 10 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 27వ డివిజన్‌లో  వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో  రాహుల్ గాంధీ ఛత్రోన్ కీ గుంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కొరివి పరమేష్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఇంచార్జి లు ఖాళీద్ భాయ్, రోషిని ఆదేశాల వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖియోజకవర్గం వరంగల్ మండల పరిధిలో యాకుబ్ పూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీ అఫ్ ఎక్సలెన్స్ బాయ్స్ కాలేజీ లో  చాత్రోన్ కి గుంజ్ కార్యక్రమం పై యువత కు అవగాహన  కార్యక్రమం గురించి వివరిస్తూ

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విద్యార్థులు యువతతో మమేకమై విద్యా ఉపాధి, పేపర్ లీకేజీలు నియామక పరీక్షల్లో జాప్యం వంటి సమస్యలపై చర్చిస్తూ యువత డేటాను ఎలా అమ్ముతున్నారో ఉపాధి మార్గంలో ఎలా మూసి వేస్తున్నారో నిరంతరం లేవనెత్తుతూ యువతలో చైతన్యం కల్పించడమే చాత్రోన్ కీ గంజ్  కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్,స్థానిక కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.