11 August, 2026 | 3:26 AM

కాంగ్రెస్‌లోకి పాలంపేట సర్పంచ్, మాజీ సర్పంచ్

11-08-2026 12:00 AM

వెంకటాపూర్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సర్పంచ్ చల్లగుంట రాజు, మాజీ సర్పంచ్, గౌడ సంఘం అధ్యక్షుడు కారిపోతుల సత్యం సోమవారం బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి సీతక్క వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చల్లగుంట రాజు, కారిపోతుల సత్యం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిక్షపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.