20-05-2024 01:35:07 AM
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
సూర్యాపేట/ హనుమకొండ, మే 19 (విజయక్రాంతి): నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్ని కలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యా పేటలో నిర్వ హించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లు ప్రజలను హిం సించిన బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పట్ట భద్రులు కాంగ్రెస్‌ను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, నాయకులు కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాకర్స్‌ను ఓట్లు అభ్యర్థించిన మల్లన్న
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హను మకొండలోని కాకతీయ యూనివర్సిటీ, పబ్లిక్ పార్క్, ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆదివారం ఉదయం వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
* గత పదేళ్లు ప్రజలను హింసించిన బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పట్టభద్రులు కాంగ్రెస్‌ను ఆదరిస్తారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.