వయనాడ్ లో రాహుల్ గాంధీ భారీ విజయం
04-06-2024 03:56 PM
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి వరుసగా రెండో విజయం సాధించారు. తన సమీప సీపీఐ ప్రత్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలపైగా మెజారిటీతో విజయఢంకా మోగించారు. అటు ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో 3.7 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో బీజేపీ 296, కాంగ్రెస్ 228, ఇతరులు 19 స్థానాల్లో ముందంజలో ఉంది.






