1 July, 2026 | 7:09 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

నిన్ననే వచ్చేది ఉండే.. రాలేకపోయా: రాహుల్ గాంధీ

26-04-2025 04:39 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (Hyderabad International Convention Centre)లో రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. భారత్ సమ్మిట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని, తను నిన్ననే భారత్ సమ్మిట్ లో పాల్గొన్నాల్సి ఉందన్నారు. కాకపోతే కాశ్మీర్ కు వెళ్లడం వల్ల రాలేకపోయా అని, ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని, కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించాను.. మొదలు పెట్టాక వెనకడుగు వేయలేదని రాహుల్ గాంధీ చెప్పారు. పాదయాత్ర మొదలుపెట్టాక చాలా మంది నాతో కలిసి నడవటం మొదలుపెట్టారని, పాదయాత్రలో జనం సమస్యల వినటం నేర్చుకున్నానని,  ప్రజల సమస్యలు వినటంలో నాయకులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. కొత్తతరం భాషను రాజకీయ నాయకులు అర్థం చేసుకొవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.