calender_icon.png 2 May, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ సమయంలో ఏది అవసరమో.. కాంగ్రెస్‌కు బాగా తెలుసు

26-04-2025 04:26:09 PM

విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనే మా అత్యున్నత ప్రాధాన్యత

పట్టభద్రులు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు.. కానీ ఉద్యోగాలు లేవు

హైదరాబాద్: హెచ్ఐసీసీలో రెండో రోజు భారత్‌ సమ్మిట్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Congress leader Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మా ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అనేక పథకాలు తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.

రైతులకు సుమారు రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుభరోసా(Rythu Bharosa) కింద రైతులకు ఎకరాకు రూ. 12 వేలు, వరికి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తున్నామని వెల్లడించారు. పట్టభద్రులు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు.. కానీ ఉద్యోగాలు లేవని, యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామని చెప్పారు. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.. ఏడాదిన్నరలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

ప్రజలకు ఏ సమయంలో ఏది అవసరమో కాంగ్రెస్(Congress)కు బాగా తెలుసని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనే మా అత్యున్నత ప్రాధాన్యతన్నారు. రైతులు, మహిళలు, యువతకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యాఖ్యానించారు. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ మహిళలు(Telangana women) పోటీ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించామన్న సీఎం దావోస్ నుండి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ అజెండాగా పెట్టుకున్నామన్నారు. మహిళా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలను బడా పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.