రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి.. అమిత్ షా డిమాండ్
01-07-2024 02:55 PM
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. హిందూ సమాజం అంటే ఒక్క మోడీ కాదు.. హిందూ సమాజం అంటే ఒక్క బీజేపీ, ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సభలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా హిందువులే అని రాహుల్ పేర్కొన్నారు. హింస భావనను ధర్మంతో జోడించడం సరికాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హిందూ భావన తెచ్చిన రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తాన్ని భయకంపితులు చేశారని తెలిపారు. క్షమాపణలు చెప్పాకే రాహుల్ ప్రసంగం కొనసాగించాలని అమిత్ షా డిమాండ్ చేశారు.






