7 July, 2026 | 12:59 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ

19-06-2025 08:16 PM

ఒడితల ప్రణవ్ బాబు..

హుజురాబాద్ (విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు(Congress Party Constituency In-charge Pranav Babu) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోని సమస్యలపై ప్రభుత్వంని నిలదీస్తూ  ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు.

భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో కుల గణన  ద్వారా అన్ని వర్గాలకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో న్యాయం చేస్తున్నామని అన్నారు. రాబోయే తరాలకు రాహుల్ గాంధీ మార్గదర్శకంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.