20-06-2025 12:00:00 AM
కరీంనగర్, జూన్ 19 (విజయ క్రాంతి): లోక్ సభ ప్రతిపక్ష నేత, జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డిసిసి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు లు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మత్ హుస్సేన్, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, గడ్డం విలాస్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, చర్ల పద్మ, బొబ్బిలి విక్టర్, గుండాటి శ్రీనివాస్, నిహాల్, వంగల విద్యాసాగర్, కల్వల రామచందర్, తోట అంజయ్య, కర్ర రాజశేఖర్, నెల్లి నరేష్, మంద మహేష్, ఎండి చాంద్, హస్తపురం ర మేష్, ఇన్నారెడ్డి, దన్నా సింగ్, హస్తపురం తి రుమల, పెద్ది గారి తిరుపతి, సలీమ్ ఉద్దీన్, వెన్నం రజిత రెడ్డి, కట్టె కోల ప్రభాకర్, భాకరాప్, శివయ్య కంకణాల, అనిల్ కుమార్ గు ప్తా, మేకల నరసయ్య, మాదాసు శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.