5 August, 2026 | 9:37 PM

ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం..

19-05-2024 05:07 PM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఐదో విడుతలో యూపీలో 14, మహారాష్ట్రలో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్ లో7, ఒడిశా, బిహార్ లో 5 చొప్పున పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఐదో విడత పోలింగ్  రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్  ప్రతాప్ రూడీ, చిరాగ్ పాసవాన్ బరిలో ఉన్నారు.

రేపు మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షప్తం కానుంది. ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. లక్నో నుంచి రాజ్ నాథ్ సింగ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 4 విడతల్లో 397 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ పూర్తి అయింది. ఈ నెల 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.