calender_icon.png 10 January, 2026 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచారం గృహంపై దాడి

09-01-2026 12:00:00 AM

ఒకరి అరెస్టు, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలింపు 

ఎల్బీనగర్, జనవరి 8 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పతిధిలోని కమ్మగూడలోని హర్షిత గెస్ట్ హౌజ్ లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఒకరిని అరె స్టు చేయగా, ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.బాధిత ఇద్దరు యువతులు ఢిల్లీ,ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కమ్మగూడ లోని హర్షిత గెస్ట్ హౌస్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగ్గ సమాచారం రాగా, సెర్చ్ పర్మిషన్ తీసుకొని బుధవారం వనస్థలిపురం పోలీసులు దాడి చేశారు.

గెస్ట్ హౌస్‌లో తనిఖీ చేయగా ఇద్దరు మహిళలతోపాట రిసెప్షనిస్టు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న మచిలీపట్టణానికి షేక్ ఖలీల్ తండ్రి ఇస్మాయిల్ (27)ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు, ఇద్దరి మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు. ఆర్గనైజర్ ఆదిత్య చౌదరి పరారీలో ఉన్నట్లు చెప్పారు.