25-05-2025 12:41:04 AM
మహబూబాబాద్, మే 24 (విజయక్రాం తి): విజయవాడ కాజీపేట రైల్వేసెక్షన్‌లో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఎన్‌ఐ (నాన్ ఇంటర్ లాకింగ్ సిగ్నల్ ట్రాఫిక్ ని యంత్రణ) పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తా యి. పలు రైళ్లకు మహబూబాబాద్‌కు బదు లు కేసముద్రం రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇచ్చారు.
కొత్తగా చేపట్టిన మూడో లైన్ సిగ్న ల్ మార్పులు, ట్రాక్ అనుసంధానం కోసం అప్‌లైన్‌లో శనివారం నుంచి 27 వరకు విజయవాడ కాజీపేట సెక్షన్‌లో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. శుక్రవా రం నుంచి 27 వరకు అప్, డౌన్ మార్గాల్లో బ్లాక్ తీసుకొని ఎన్‌ఐ పనులు నిర్వహిస్తున్నా రు.
విజయవాడ డోర్నకల్ కాజీపేట మార్గం లో ఉదయం ప్రజలు ఎక్కువగా ప్రయాణించే శాతవాహన, గోల్కొండ, సింగరేణి, పుష్ పుల్ తదితర రైళ్లను రద్దు చేయడంతో, కాకతీయ, కృష్ణ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ నెల 27 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.