calender_icon.png 25 May, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయట మాట్లాడవద్దు

25-05-2025 12:40:03 AM

-అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడితే మంచిది

-అన్నిపార్టీల్లోనూ రేవంత్‌రెడ్డి కోవర్టులు

-మా పార్టీలోనూ ఉండొచ్చు 

-ఉత్తరాలు రాయడం గొప్ప విషయమేమీ కాదు 

-పార్టీ అధ్యక్షుడికి 

-ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు

-ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్షన్

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): పార్టీలో కోవర్టులున్నారని, కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ అన్ని పార్టీల్లోనూ రేవంత్‌రెడ్డి కోవర్టులున్నారని, తమ పార్టీలోనూ ఉండొచ్చని, సమయం వచ్చినప్పుడు కోవర్టులెవరో బయటపడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాలు రాయడం గొప్ప విషయమేమీ కాదన్నారు. ఏ స్థాయి నేత అయినా అంతర్గత అంశాలు అంతర్గతంగానే మాట్లాడితే మంచిదన్నారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత లేఖ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు  కేటీఆర్  స్పం దించారు. 

తమది ప్రజాస్వామ్య పార్టీ అని అధ్యక్షుడికి ఉత్తరాలు రాయొచ్చు, సలహాలు ఇవ్వొచ్చన్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు పార్టీ ఫోరమ్స్, ఆఫీసు బేరర్స్ ఉన్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు పార్లమెంట్  నియోజకవర్గాల వారీగా ఎన్నో గంటలు రివ్యూ మీటింగులు నిర్వహించామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వా త జరిగిన ఈ రివ్యూ మీటింగుల్లో వేల మంది కార్యకర్తలు మాట్లాడారన్నారు. చాలామంది కార్యకర్తలు మైకుల్లో మాట్లాడారని, ఎన్నో సూచనలు, సలహాలు, పేపర్ల మీద రాసి ఇ చ్చారని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్‌రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ శని అని ఈ రెండింటినీ ఎట్లా వదిలించాలన్నదే తమ టార్గెట్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.