25-05-2025 12:43:01 AM
60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం
కొమ్రంభీం ఆసిఫాబాద్, మే 24 (విజయక్రాంతి): వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ నకిలీ విత్తనాలు విక్రయించేందుకు దళారులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. కాగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం పెద్దవాగు సమీపంలో శని వారం టాస్క్‌ఫోర్స్, రూరల్ పోలీసులు పెద్ద ఎత్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం పట్టుకున్నారు.
రూ.60లక్షల విలువజేసే 20 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించా రు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. కాగజ్‌నగర్‌లో నివాసముండే కొత్తపల్లి సదాశివ అనే వ్యక్తి నకిలీ బీటీ విత్తనాలు అమ్ముతున్న ట్టు సమాచారం రావడంతో అతడిపై నిఘా ఉంచామన్నారు.
ఐచర్ వ్యాన్‌లో 20 క్వి ంటాళ్ల నకిలీ బీటీ విత్తనాల ను సరఫరా చేస్తున్నట్టు సమాచారం రావడంతో కాపు కాసి ప ట్టుకున్నట్టు చెప్పారు. నకిలీ పత్తి విత్తనాల స రఫరాలో భాగస్వాములైన సదాశివ, లక్ష్మణ్, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు.