14-08-2025 11:11:20 AM
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సంరద్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) పతకాలు ప్రకటించింది. తెలంగాణకు(Telangana) ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ వరించాయి. ఏఎస్ఐ సిద్ధయ్య, హెడ్ కానిస్టేబుల్ నిడమానూరి హుస్సేన్ కు ప్రెసిడెంట్ మెడల్స్ దక్కింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి రెండు ప్రెసిడెంట్ మెడల్స్(President's Medals), 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్, అగ్నిమాపక సేవలు, హోం గార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ పతకాలు అందుకున్న వారి అధికారిక జాబితాను హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ గౌరవాలలో శౌర్య పురస్కారాలు, విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం, ప్రతిభావంతులైన సేవకు పతకం ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం 1,090 పతకాలను ప్రదానం చేయనున్నారు. వీటిలో 233 శౌర్య పతకాలు, 99 విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకాలు, 758 ప్రశంసాపూర్వక సేవ పతకాలు ఉన్నాయి.