3 July, 2026 | 1:07 AM

చైనాలో భవనాల నుంచి రెయిన్

03-07-2026 12:00 AM
  1. పార్కులు, వీధులు, బస్ స్టాప్‌లు, ఫ్లుఓవర్ల మీద తుంపర వర్షం
  2. ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుదల

బీజింగ్, జూలై2: చైనాలో పెరుగుతున్న వడగాలులను, వేడిని తగ్గించడానికి భవనాల పైనుంచి, పార్కులు, వీధులు, బస్ స్టాప్‌లు, ఫ్లుఓవర్ల మీది నుంచి ఆ దేశం వర్షం కురిపిస్తోంది. వాతావరణాన్ని చల్లబరచడానికి చైనా రూఫ్‌స్టాప్ మిస్టింగ్ సిస్టమ్ బాగా ప్రాచూర్యం పొందుతోంది. ఎవాపరేటివ్ కూలింగ్ ద్వారా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీ లు ఉన్నప్పుడు సుమారు 5 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గించేలా చేసి, ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకొంటోంది.

ఇప్పటికే అక్కడ పార్కులు, బహిరంగ ప్రదేశాలు, పాదచారుల వీధులు, బస్ స్టాప్‌ల వద్ద ఈ కృత్రిమ తుంపర జల్లులు కురుస్తున్నాయి. ఉత్తర చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో ఉన్న యున్‌చెంగ్ నగరంలో, ఎత్తున అపార్ట్మెంట్ భవనా ల పైకప్పులపై నీటిని సన్నని తుంపరలా చల్లే మిస్టింగ్ సిస్టమ్లను అమర్చారు. ఇందుకు సబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతూ.. అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ వీడియోల్లో ఇంటి పైకప్పుల నుంచి మంచు మేఘాల దృశ్యాలు కనిపిస్తున్నాయి.