3 July, 2026 | 1:04 AM

మంచుకొండల్లో భక్తితరంగం

03-07-2026 12:00 AM
  1. అమర్‌నాథ్ యాత్రకు శ్రీకారం
  2. తొలిబ్యాచ్‌లో 4,822 మంది భక్తులు 
  3. యాత్రను ప్రారంభించిన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  
  4. ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు
  5. కట్టుదిట్టమైనభద్రత

జమ్ము, జూలై 2: దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో కొలువైన బాబా అమర్‌నాథ్ యా త్ర జమ్ములోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కఠినమైన మంచు కొండలను దాటుకుంటూ హరహర మహాదేవ నామస్మరణతో భక్తులు పవిత్ర హిమలింగ దర్శనా నికి బయలుదేరారు. జమ్ముకశ్మీర్‌లోని బల్తా ల్ మార్గం ద్వారా ప్రయాణిస్తున్న యాత్రికుల మొదటి బృందానికి ఘన స్వాగతం లభించింది. అంతకుముందు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్ర కాన్వాయ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.  

పటిష్టమైన భద్రత, విస్తృత ఏర్పాట్లు

అమర్‌నాథ్ యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు యంత్రాంగం అన్ని రకాల చర్య లు చేపట్టింది. చందర్‌కోట్ లంగర్ సైట్ వద్ద భక్తులకు అవసరమైన వసతులు, భోజన సదుపాయాలను సిద్ధం చేశారు. పోలీస్, ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సె, ట్రాఫిక్ పోలీస్, ఆరోగ్య, అగ్నిమాపక శాఖలు, ఇతర అత్యవసర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. 

57 రోజుల సుదీర్ఘ ప్రయాణం

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో దాదా పు 3,880 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. 57 రోజుల పాటు సాగే ఈ వార్షిక యాత్ర అధికారికంగా పహల్గామ్, బాల్తాల్ అనే రెండు మార్గాల్లో కొనసాగనుంది.