calender_icon.png 27 May, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 4 రోజులు వర్షాలు

26-05-2025 01:32:52 AM

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): మరో నాలుగు రోజుల పా టు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరించింది.

ఈ నెల 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెద క్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో.మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ నెల 29న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్ర తలు 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.