తెలంగాణకు వర్ష సూచన.. 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వర్షాల సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, వరదలు సంభవించినప్పుడు సురక్షిత ప్రాంతాలను వెతకాలని ఆ శాఖ ప్రజలకు సూచించింది. తెలంగాణ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, కొముంభీం, ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, వనపర్తి, గద్వాల, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్ట్ 26 నుండి ఆగస్టు 29 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది. నిన్న, కొన్ని చోట్ల మాత్రమే 4.2 సెం.మీ, 4.4 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.






