నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
26-08-2024 08:21 AM
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు యల్లావుల చక్రధర్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రముఖులంతా హాజరు కానున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జంట నగరాలకు చెందిన కుల పెద్దలు కుటుంబ సమేతంగా తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగెల్లి అంజన్‌యాదవ్, జంగిటి ప్రవీణ్‌కుమార్, ఎంబీ కృష్ణయాదవ్, కీర్తి సుధాకర్‌రావు, రాంప్రసాద్, ఉడుత పరమేశ్వర్, బొట్టు మధు తదితరులు పాల్గొన్నారు.






