ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వర్షం
04-06-2026 03:17 PM
ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది.గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించగా, కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






