మండేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
04-06-2026 03:15 PM
తంగళ్ళపల్లి ,జూన్ 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి గ్రామపంచాయతీలో అశ్విని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సూచనలు అందించారు.గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాధగోని సాగర్, వార్డు సభ్యులు కొమ్మెట మల్లేశం, కార్యదర్శి ముదం ప్రశాంత్, కారోబార్ లచ్చి రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య, దాసరి రవి తదితరులు పాల్గొన్నారు.






