calender_icon.png 12 June, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 రోజుల పాటు వర్షాలు

11-06-2025 12:00:00 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు వ ర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగు లాంబ గద్వాల జిల్లాల్లో వర్షా లు కురిసే అవకాశం ఉందని, రేపు మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూలు, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో మో స్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్క డక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.