25 July, 2026 | 1:59 AM

నేడు పలు జిల్లాల్లో వర్షాలు

25-07-2026 12:32 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా ల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి,  వికారాబాద్, ములుగు, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.  ఆయా జిల్లాల్లో బలమైన ఉపరి తల గాలులు కూడా వీస్తాయని పేర్కొంది.