04-07-2025 09:30:11 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదనంగా ఈ ప్రాంతంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీనివల్ల వాతావరణ మార్పులు మరింతగా ఉంటాయని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు శుక్రవారం ఉదయం నుంచే చిరుజల్లులు పడుతున్నాయి. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో గంటలకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఐఎండీ హైదరాబాద్ సూచన ప్రకారం, జూలై 9 వరకు తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.