రాష్ట్రంలో 18 నుంచి 24 వరకు వర్షాలు
నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాల్పులు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): వాతావరణంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఈనెల 18 నుంచి 24 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ద్రోణి, అల్పపీడనం ఏర్పడే వీలుందని, దీని ప్రభావంతో ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయని నాలుగైదు రోజుల్లో ఉత్తర తెలంగాణ అంతటా విస్తరించే సూచనలు ఉన్నాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.






