16 June, 2026 | 2:38 AM

రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది

16-06-2026 12:00 AM

పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి 

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె మాజీ మంత్రి బోడ జనార్ధన్, జిల్లా అధ్యక్షుడు వినోద్, కావేటి సబితలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.యూరియా బు కింగ్ కోసం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద న్నారు. పంట కొనుగోలు ప్రక్రియలో అనవసర నిబంధనలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

కల్లాల నుం చి గోదాముల వరకు రవాణా ఖర్చులు రైతులపైనే మోపడంతో ప్రభుత్వం రూ.1200 కోట్ల భారం రైతులపై వేసిందని ఆరోపించారు.పోడు భూముల సమస్యపై ప్రతి ఖరీ ఫ్ సీజన్ ప్రారంభంలో జిల్లాలో పోడు పోరు జరుగుతుండటం దురదృష్టకరమన్నారు. అటవీభూ ములకు జియో మార్కిం గ్, జియో ట్యాగింగ్ చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. అటవీ హక్కుల చట్టం అమలు కనిపించడం లేదని, గిరిజన కార్పొరేషన్ ఉనికి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో 1/70 చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో గిరిజనేతరుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. ఈ అంశంపై అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. కలెక్టర్లకు చట్టాలపై సరైన అవగా హన లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని, అందుకే తెలంగాణ రక్షణ సేనను స్థాపించాల్సి వచ్చిందన్నారు.తమ పార్టీ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పనిచేస్తుందని తెలిపారు.ఆసిఫాబాద్ జిల్లా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని కొనియాడారు.

పార్టీ జెండా కార్యక్రమాలు, తన పర్యటన సందర్భంగా పోలీసు లు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్య లు పునరావృతమైతే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ముందుగా పార్టీ శ్రేణు లు కవితకు ఘన స్వాగతం పలికాయి. అంబేద్కర్, కుమ్రం భీమ్ విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్, నాయకులు అశోక్, ప్రసాద్, తిరుపతి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.