3 July, 2026 | 5:27 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

12 వరకు రాష్ట్రంలో వర్షాలు

08-09-2025 01:57 AM

తేలికపాటి నుంచి మోస్తరు వానలు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈనెల 12 వరకు వర్షాలు కురుస్తాయని తెలంగాన వాతావరణ శాఖ సూచించింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాలతోపాటు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.