calender_icon.png 8 September, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో

08-09-2025 01:57:11 AM

  1. నిర్వాసితులకు న్యాయం జరగాలి
  2. లేదంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తా
  3. రైతుల పక్షాన ముందుండి కొట్లాడుతా
  4. మంత్రి పదవి ఆలస్యమైనా వేచి చూస్తా
  5. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి 

సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం భూనిర్వాసిత రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని, అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతానని స్పష్టం చేశారు.

అలెన్మైంట్ సమయంలో కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేకు కూడా సమాచారం ఇవ్వకుండా చేయ డం దుర్మార్గమని అన్నారు. నియోజకవర్గం లో రైతులు ఎక్కడికి అక్కడ స్తంభింపజేయ డం ద్వారానే అలెన్మైంట్ మార్పు సాధ్యమని అన్నారు. తాను ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి లాలూచీపడే వ్యక్తిని కాదని, పద వి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతానని, అవసరమైతే త్యాగం చేయడానికి కూ డా సిద్ధమ ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజల సహకారం ఉంటే తాను ఏ త్యాగానికైనా వెనుకా డబోనని, రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తానని చెప్పారు. పార్టీ పెద్దలు గతంలో మంత్రి పదవి హామీ ఇచ్చారని ఇప్పటికీ ఆలస్యమైనా సరే వేచి చూస్తానని మరోసారి వ్యాఖ్యానించారు.