08-09-2025 01:54:59 AM
ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంఈడీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విద్యామండలి చైర్మన్ ప్రొ.వీ.బాలకిష్టారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఆగస్టు 4 నుంచి 11 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించారు.