18 April, 2026 | 1:32 AM

వాన నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలి

03-05-2025 01:53 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 2: కురిసే వాన నీటిని ఒడిసిపెట్టి భూగర్భ జలాలను పెంచే విధంగా సంరక్షణ పద్దతులను పాటించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వాచ్ కమిటీ సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో బోర్ వెల్స్ వద్ద వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీలలో నూతన గృహాలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గృహాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

పరిశ్రమలలో వాన నీటిని ఒడిసి పట్టేందుకు స్టోరేజ్ ఫాండ్స్ రీఛార్జ్ పిట్స్, రూప్ టాప్ రైన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ తప్పక నిర్మించాలన్నారు. గ్రామ పంచాయతీలలో రీఛార్జ్ కి అనువైన చోట వాన నీటి రీఛార్జి పిక్స్ ను ఏర్పాటు చేయాలని డిపిఒ కు తెలిపారు. పాఠశాలలో రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గతంలో నిర్మించిన రీఛార్జి పిట్స్ పరిశీలించి , ఉపయోగం లోకి తేవాలని పేర్కొన్నారు. అనువైన చోట చెక్ డ్యాముల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. డి పి ఓ, డి ఆర్ డి ఓ లు గ్రామాలలో ఉన్న అన్ని బోర్ వెల్స్ టాకింగ్ చేసి వివరాలు పంపాలన్నారు.

బోర్వెల్ రింగ్ వాహన యజమానులు తమ రిగ్ వాహనాలకు వాల్టా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్‌ఓసి కలిగి ఉన్న వారు మాత్రమే బోర్ వెల్స్ డ్రిల్ చేయటానికి అర్హులని తెలిపారు. వాల్టా యాక్టివ్ పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.