శంషాబాద్ విమానాశ్రయంలో రాజాసింగ్ అరెస్ట్
16-06-2024 01:53 PM
హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) వద్ద ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి విమానాశ్రయానికి చేరుకున్నారు. పశువుల రవాణా, అమ్మకం సమస్యపై మతపరమైన ఉద్రిక్తత నెలకొని ఉన్న మెదక్ జిల్లాకు రాజాసింగ్ వెళ్తారన్న సమాచారంతో పోలీసులు ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం రాజాసింగ్ అదుపులోకి ఉన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే తనను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు.
https://twitter.com/TigerRajaSingh/status/1802250194349953206






