18 August, 2026 | 12:16 AM

సీసీఎస్ ప్రక్షాళన.. 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు

16-06-2024 02:07 PM

హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు నిర్ణయానలు తీసుకుంటున్నారు. 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు మల్టీ జోన్‌-2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్ లో ఇటీవల ఏసీబీకీ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ ఉమామహేశ్వరావు,  ఇన్‌స్పెక్టర్ సుధాకర్ పై సస్పెన్సన్ వేటు పడింది. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్ -7 సుధాకర్ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయాడు. సీసీఎస్ పై వరస ఆరోపణలతో తాజాగా 12 మంది బదిలీ అయ్యారు.