16 July, 2026 | 3:36 PM

మహిళలు మౌనం వీడి నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలి

06-06-2024 12:58 PM

రాజన్న సిరిసిల్ల: విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లావ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిఘా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  మహిళలను వేధిస్తున్న పోకిరీలపై 3 కేసులు, 4 పెట్టి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు,బాలికలు,విద్యార్థినిలు వేధింపులకు గురైనట్లు అయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100 కు పిర్యాదు చేయాలని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామ్నారు. జిల్లాలో  షీ టీమ్స్ బృందాల ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని విద్యార్థులకు  ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై  అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.