16 July, 2026 | 3:54 PM

వాత పెడతా, బొంద పెడతా వ్యాఖ్యలు మానుకోవాలి

06-06-2024 12:48 PM

బిజెపి విజయానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం ..!

లక్షలాది ఓట్లు సాధించిన బిఆర్ఎస్ పార్టీ బిజేపితో కుమ్మక్కు అనడం ఎమ్మెల్యే అవివేకం...

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నీ విమర్శిస్తే అభివృద్ధిని కించపరిచినట్టే....

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ 

వనపర్తి : గడిచిన 8నెలల కాలంలో నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి లేక మైకు పట్టుకుంటే కర్ర కాల్చి వాత పెడతా, బొండపెడతా, పాతిపెడతా అంటూ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతున్న ఊతపదాలు మానుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మండి పడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. 

బిజెపి విజయానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణమని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి  రాజకీయాలలో హుందాతనాన్ని కాపాడాలని తమ అంతర్గతపోరును అందరిపై రుద్దడం తగదని హితవు పలికారు. పూటకో పార్టీ మార్చే మీరు బిఆర్ఎస్ వెంట్రుక కూడా కదలించలేరని, రాజకీయాలు పార్టీల మూల సిద్దంతాలపై ఉంటాయి ఏపార్టీ సిద్ధాంతం తెలియని మీరు సొంత పార్టీ వారిని ద్రోహులుగా చిత్రీకరించడం, నమ్మక ద్రోహులను అందలం ఎక్కించడం నీకు తెలిసిన విద్య అన్నారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లక్ష 25వేల ఎకరాలకు శాశ్వత సాగునీరు అందించి కోట్లాది రూపాయలతో అభివృద్ధి సాధించిన మా నిరంజన్ రెడ్డిని విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మివేసినట్టే అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలకు మించిన అభివృద్ధి చేసి మాజీ మంత్రి నిరంజనుడు చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శంగా నిలిచారని చేతనైతే ఇంకా అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసురుతున్నామన్నారు. ఇకనైనా విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్, పార్టీ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్, మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ ఉంగ్లమ్, తిరుమల్, ప్యాట తిరుపతయ్య పాల్గొన్నారు.