calender_icon.png 21 May, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి

21-05-2025 11:56:19 AM

మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న

తుంగతుర్తి, విజయక్రాంతి: భారతదేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Former Prime Minister Rajiv Gandhi) చేసిన సేవలు మరువలేనివని మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల త్యాగాల చరిత్ర కలగని గుర్తు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య బ్యాంకులో జాతీయం ఆర్థిక వనరులను సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ సేవలు మరువలేనివని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు 18 నెలల పరిపాలనలో 1400 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ పథకాలు, ప్రజల్లోకి తీసుకురావాలని కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి అత్యధిక స్థానాలు గెలుపొందులకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పుల రాంబాబు కొండారాజు గంగరాజు యాదవ్ కటకం వెంకటేశ్వర్లు ఆలయ చైర్మన్ ఎలగందుల సంజీవ, మాచర్ల అనిల్, ప్రవీణ్ రెడ్డి యాదయ్య నరసయ్య అక్కినపల్లి రాములు ,రాముల యాదవ్, ప్రవీణ్ నజీర్ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.