calender_icon.png 21 May, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

21-05-2025 11:19:26 AM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కారు, లూన ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలకపల్లి మండలం గట్టురాయిపాకల గ్రామానికి చెందిన చెటమోని రాములు (38) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.  మంగళవారం బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలోని తమ బంధువుల ఇంట్లోని శుభకార్యానికి తన ద్విచక్ర వాహనం లూనాపై వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వెళుతుండగా కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో అటుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో రాములకు తలకు బలమైన గాయంతో తీవ్ర రక్తస్రావమై కింద పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి 108 సాయంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తరలించారు.  చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు.  మృతుడికి భార్య రజిత, పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో బిజెపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేత ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.