22 May, 2026 | 2:05 AM

దేశ ఆధునీకీకరణలో రాజీవ్‌గాంధీది కీలకపాత్ర

22-05-2026 12:00 AM

చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ

మునుగోడు, మే 21: యువతకు సాంకేతికతను చేరువ చేయడంలో, దేశ ఆధునికీకరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. గురువారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.నాయకులు, దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బీమనపల్లి సైదులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.