నూతనకల్ పీహెచ్‌సీలో సాధారణ ప్రసవం
నూతనకల్, మే 21 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యులు, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక మహిళకు సురక్షితంగా సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేశారు. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన చీమల అనుష అనే గర్భిణి గురువారం ఉదయం 10:30 గంటలకు పురిటి నొప్పులతో నూతనకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
ఆమెను వెంటనే చేర్చుకున్న వైద్యాధికారి డాక్టర్ ఆశ్రిత, పర్యవేక్షణలో వైద్య సిబ్బంది సాయంత్రం 3:54 గంటలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ ప్రసవం చేశారు.అనుషకు 2.7 కిలోల బరువుతో ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం తల్లీ, కూతురు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఆశ్రిత ప్రకటించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించి నార్మల్ డెలివరీ చేసినందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రసవ కార్యక్రమంలో వైద్యాధికారితో పాటు సీహెచ్‌ఓ ఎల్. చరణ్, పీహెచ్‌ఎన్ దయమణి, హెచ్‌ఎస్ చిన్ని, నర్సింగ్ ఆఫీసర్లు ప్రియాంక, మౌనిక, హెచ్‌ఏ సరస్వతి, ఆశా కార్యకర్త రమాదేవి, ఆయా వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.






