ఉప్పల్ స్టేడియం వద్ద రాజీవ్ విగ్రహం : వీహెచ్
26-05-2024 03:22 AM
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ఉప్పల్ స్టేడియం వద్ద 13 అడుగుల రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు(వీహెచ్) తెలిపారు. తన సొంత డబ్బుతో అమలాపురంలో విగ్రహం తయారు చేయించినట్లు శనివారం గాంధీభవన్‌లో మీడియాతో వెల్లడించారు. ఆగస్టు 20న రాజీవ్‌గాంధీ జయంతి రోజున ఆ విగ్రహాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ పేరు పెట్టాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సలహా ఇచ్చానని వీహెచ్ పేర్కొన్నారు.






