7 August, 2026 | 11:57 AM

జూన్ 10 లోపు పనులు పూర్తి చేయాలి

26-05-2024 03:25 AM

మెదక్, మే 25 (విజయక్రాంతి): జూన్ 10వ తేదీలోపు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో శనివారం విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరిం గ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని ఆరా తీశారు. విద్యార్థులు మం చిగా చదువుకునేందుకు అనువుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక్క పని పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా పనులకు ఆటంకాలు కలిగితే తక్షణం ఎంపీడీవోలు పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని సూచించారు. బిల్లుల చెల్లింపు లు జరిగిన ప్రతిపైసా లెక్కలు పక్కాగా ఉండాలని, చెల్లింపు వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని పేర్కొన్నా రు. సమావేశంలో డీఈవో రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

-జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్