21 August, 2026 | 1:02 AM

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

21-08-2026 12:04 AM

నివాళులర్పించిన ఫిషర్‌మెన్ చైర్మన్ సాయికుమార్ తదితరులు

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్ సచివాలయం ఎదురుగా మాజీ ప్రధాని, ‘డిజిటల్ ఇండియా’కు పునాదులు వేసిన రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమం త్ రావు, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, పీసీసీ కాంగ్రెస్ ఫిషర్‌మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, రాపోలు జయప్రకాశ్ తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ దేశంలో సాంకేతికత, సమాచార రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువతకు ఆధుని క విద్య, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు దేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో కీలకమైనవని గుర్తు చేశారు.