21-08-2025 01:15:54 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
బిచ్కుంద, ఆగష్టు 20 ( విజయ క్రాంతి),నవ భారత నిర్మాత,మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీ య శ్రీ రాజీవ్‌గాంధీ జయంతినిపురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లా డుతూ...
దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా మార్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని,యువత రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ఆయన చారిత్రాత్మక నిర్ణయమని,నేడు భారత్ ఏఐ, టెక్నాలజీ రంగాల్లో ముందుకు దూసుకు పోతుందంటే దానికి బలమైన పునాది వేసింది రాజీవ్ గాంధీ విజన్ అని,దేశం కోసం, ప్రజల కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు స్ఫూర్తి దాయకమని..
ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు..ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందున్న కర్తవ్యం అని చెప్పారు.. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు, యువత సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, రమేష్ దేశాయ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.