calender_icon.png 21 August, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగంపల్లి నాలాలో మహిళ మృతదేహం లభ్యం

21-08-2025 09:37:03 AM

హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాలలో సహా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నారు. దీంతో నాలాలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. కాగా, లింగంపల్లి నాలాలో మహిళ మృతదేహం లభ్యమైంది. లింగంపల్లి మార్కెట్(Lingampalli Market) గుండా వెళుతున్న నాలాలో మృతదేహాన్ని స్థానికులు చూసి చందానగర్ పోలీసులకు(Chandanagar Police) సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాన్ని నాలా నుండి బయటకు తీశారు. ఆ మహిళ కొన్ని బంగారు ఆభరణాలు ధరించి ఉంది. ఆమె వద్ద ఒక మొబైల్ ఫోన్ కూడా దొరికింది. ఆ ఫోన్ సహాయంతో పోలీసులు ఆ మహిళ గుర్తింపును కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహిళ నాలాలో పడిందా? లేదా ఎవరైనా హత్య చేసి పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన లింగంపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అక్కడ దానిని భద్రపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.