21-08-2025 10:13:55 AM
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జితేంద్రసింగ్(Union Minister Jitendra Singh), ఇస్రో ఛైర్మన్ నారాయణన్ గురువారం మధ్యాహ్నం గగన్ యాన్ మిషన్ వివరాలు(Gaganyaan Mission Details) వెల్లడించనున్నారు. భారత వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా(Indian astronaut Captain Shubhanshu Shukla) మీడియాతో మాట్లాడనున్నారు. తన అంతరిక్షయాత్ర వివరాలను శుభాంశు శుక్లా వెల్లడించారు. శుక్లా అంతరిక్ష యాత్ర ముగించుకుని ఈ నెల 17న భారత్ కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి, ఇస్రో ఛైర్మన్ ను కలిసి శుక్లా విశేషాలు పంచుకోనున్నారు. మధ్యాహ్నం దేశ ప్రజలకు శుక్లా అంతరిక్ష యాత్ర విశేషాలు వెల్లడించనున్నారు.